మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
తుంగతుర్తి ఎస్‌ఐ క్రాంతి
తుంగతుర్తి, జూలై 23: యువతను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి దూరంగా ఉండాలని తుంగతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర. క్రాంతి పిలుపునిచ్చారు. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం స్థానిక ప్రజలు, యువతకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. డ్రగ్స్ అలవాటు వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో వివరించారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగులు వేయాలని కోరారు. గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక యువకులు, ప్రజలు, పాల్గొన్నారు.






