స్వయం సహాయక సంఘాల బలోపేతానికి వీఓ భవనాలు దోహదం
24-07-2026 12:00 AM
అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు
అలంపూర్ జూలై 23: మహిళల ఆర్థిక సాధికారత, స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ) భవనాలు కీలకమని అదనపు కలెక్టర్ బి. నర్సింగరావు అన్నారు. గురువారం వడ్డేపల్లి మండలం బుడమర్సు గ్రామంలో నూతనంగా నిర్మించిన వీఓ భవనాన్ని పరిశీలించిన ఆయన, భవనాన్ని మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణలు, పొదుపు ,రుణాల నిర్వహణకు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం ఉండరాదని సూచిస్తూ విద్యార్థులకు యూనిఫాంలు, బెడ్షీట్లను అదనపు కలెక్టర్ బి. నర్సింగరావు పంపిణీ చేశారు.






