01-01-2026 02:10:11 AM
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి) : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అంతర్జాతీయ పతంగుల పండుగకు హైదరాబాద్ వేదిక కానున్నది. జనవరి 13 నుంచి 15 వరకు నిర్వహించేందుకు పర్యాటక, సంస్కృతిక శాఖలు ఏర్పాటు చే స్తున్నాయి. అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-- 2025ను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌం డ్ నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ వేడుకలో 19 దేశాలు, 15 రాష్ట్రాలు పా ల్గొ ంటున్నాయి.
ఇండోనేషియా, ఆస్ట్రేలియా, కెనడా, శ్రీలంక, కంబోడియా, థాయిలాండ్, కొరియా, జపాన్, పోర్చుగల్, వియత్నాం, మలేషియా, ఇటలీ, స్విట్జర్లాండ్, జపాన్, అల్జీరియా, సింగపూర్, రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్ దేశాలకు చెంది నవారు పంతుగులను ఎగురేయడాకి తెలంగా ణకు వస్తున్నారు. ఇక దేశంలోని 15 రాష్ట్రాల నుం చి 40 అంతర్జాతీయ, 55 జాతీయ గాలిపటాలు ఎగురవేయడానికి వస్తున్నారని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు రాత్రిపూట ప్రత్యేక పతంగులను ఎగురవేయనున్నారు.
తెలంగాణ వంటలు..12౦౦ రకాల స్వీట్స్
తెలంగాణ సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, రాష్ట్ర సంస్కృతిని ప్రోత్సహించడానికి నిర్వహించబడతాయి. తెలంగాణలోని వివిధ వంటకాలను ఆస్వా దించడానికి ప్రత్యేక స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాల్స్‌తో తెలంగాణ వంటకాలతో పాటు 60 ఫుడ్ కోర్టులు ఏర్పాటుకు చేస్తు న్నారు. దాదాపు 100 చేనేత, హస్తకళ స్టాళ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన హైదరాబాదీ నివాసితులు ఇళ్లలో తయారుచేసిన వివిధ రకాల స్వీట్లను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవంలో 1,200 కంటే ఎక్కువ రకాల స్వీట్లతో ప్రదర్శించ బోతున్నారు. అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్‌ను కల్చర్ లాంగ్వేజ్ ఇం డియన్ కనెక్షన్స్ సహకారంతో నిర్వహిస్తారు.
హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
కైట్ ఫెస్టివల్ ముగిసిన వెంటనే .. జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. ఈ ఎయిర్ ఫెస్టివల్‌కు యూరోపియన్ దేశాల నుంచి 15 అంతర్జాతీయ ప్రమాణాల బెలూన్లు వస్తాయి. ఈ కార్యక్రమం హైదరాబాద్ శివార్లలో ఉదయం సెషన్లో, సాయంత్రం సెషన్లో పరేడ్ గ్రౌండ్స్లో నైట్ గ్లో బెలూన్లతో నిర్వహించనున్నారు.
గచ్చిబౌలిలో డ్రోన్ షో
జనవరి 13, 14 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో హైటెక్ డ్రోన్లు, బహుళ-రంగు ఎల్ ఈడీ లైట్లు, వైమానిక విన్యాసాలతో డ్రోన్ షో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో స్టేడియం మైదానంలో విస్తరించి ఉన్న పూర్తి ఎల్‌ఈడీ -లైట్ రేస్కోర్సు ఉంటుంది. వీక్షణకు జెయింట్ స్క్రీన్లపై ఎఫ్‌పీవీ (ఫస్ట్ పర్సన్ వ్యూ) వీడియో ఫీడ్లతో ఉంటుంది.