calender_icon.png 1 January, 2026 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

713 కోట్లు విడుదల

01-01-2026 02:12:25 AM

ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయ క్రాంతి) : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్ మాసానికి సంబంధించి రూ. 713 కోట్లు విడుదలచేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఆదేశాలు జారీచేశారు. డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు డిసెంబర్ మాసానికి సంబంధించిన రూ.713 కోట్ల బిల్లులు బుధవారం విడుదల చేశా రు.  ఉద్యోగుల గ్రాట్యూటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు అడ్వాన్స్‌లకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలకు ప్రతినెల రూ. 700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని గతం లో ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ నెలాఖరులో రూ.183 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత ఆగస్టు నుంచి ప్రతినెల 700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తున్నది.