calender_icon.png 23 January, 2026 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొనాల మండలంలో దేశిదారు పట్టివేత

23-01-2026 05:29:28 PM

బోథ్,(విజయక్రాంతి): సొనాల మండలంలోని సంపత్ నాయక్ తండా గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించగా రాథోడ్ పూల్ సింగ్, రాథోడ్ సంజు అనే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర కి చెందిన దేశీదారు బాటిల్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. ఇద్దరి వ్యక్తుల దగ్గర మొత్తం 130 (90ml) బాటిల్స్ లభించాయని ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్  జుల్ఫికర్ అహ్మద్ తెలిపారు. ఈ దాడులలో ట్రైనీ సబ్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది కార్తీక్, సంధ్యారాణి, మయూరి, అరుణ, మంజుల పాల్గొన్నారు. ఎవరైనా గంజాయి, బెల్లం, పటిక, దేశీదారు, గుడుంబా కలిగి ఉన్న, అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.