23-01-2026 05:26:29 PM
ముకరంపుర,(విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు వంచ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు, ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారా లోకేష్ సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి నాగుల బాలగౌడ్, రొడ్డ శ్రీనివాస్, రొడ్డ శ్రీధర్, ఎర్రవెల్లి రవీందర్, ఆకుల కాంతయా, సందబోయిన రాజేశం, ఎర్రవెల్లి వినీత, లొంకా భాస్కర్ శర్మ, సాయిల్లా రాజమల్లు, ఇట్టా మల్లేశం, కళ్లేపల్లి అబ్రహం,కళ్యాడపు నరేష్, బ్రహ్మచారి, తిరుపతి, దాసరి రామకృష్ణ రెడ్డి, మ్యాకల రాజమల్లయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.