calender_icon.png 23 January, 2026 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు: బీఎల్ఆర్

23-01-2026 05:33:25 PM

ఉప్పల్,(విజయక్రాంతి): కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి అన్నారు. నాచారం డివిజన్లోని  శ్రీరామ నగర్ లో ఉంటున్న బిఆర్ఎస్ కార్యకర్త టేకుల రామచందర్ గత కొంత క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇటీవల కాలంలో ఆరోగ్యం మెరుగుపడడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రామచంద్ర ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  పార్టీకి కార్యకర్తల బలమని  అలాంటి కార్యకర్తల బాగోగులు చూసుకోవడం  తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు  సాయి జన్ శేఖర్ మెడల మల్లికార్జున గౌడ్ విట్టల్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు