08-07-2025 12:00:00 AM
ఇటీవల ‘కోర్ట్’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న యువ నటి శ్రీదేవి కథానాయికగా మరో సినిమా శ్రీకారం చుట్టుకుంది. స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాతో తెలుగు, తమిళ భాషల్లో ‘గుర్తింపు’ అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంతో కేజేఆర్ హీరోగా, ప్రముఖ దర్శకుడు ప్రశాం త్ పాండ్య రాజన్ శిష్యుడైన రెగన్ స్టానిస్లాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇటీవల ‘మార్క్ ఆంటోనీ’ని నిర్మించిన మినీ స్టూడియో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేయనుంది. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది.