calender_icon.png 8 July, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నాట్స్’ వేదికపై వెంకీ సినిమాల ముచ్చట్లు

08-07-2025 12:00:00 AM

తాను తదుపరి చేయబోతున్న సినిమాల జాబితాను చెప్పి అభిమానుల్లో జోష్ నింపారు హీరో వెంకటేశ్. అమెరికాలో జరిగిన ‘నాట్స్ 2025’ వేదికపై సందడి చేశారు వెంకీ మామ. ఈ సందర్భంగా మాట్లాడియన ఆయన.. చిరంజీవి, బాలయ్య సినిమాల్లో తాను నటిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో వెంకటేశ్ ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నారనే వార్తలొచ్చాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. తాజాగా వెంకటేశ్ ఈ విషయాన్ని చెప్పేశారు. ‘మెగా౧౫౭’లో తాను పోషించబోయే పాత్ర ఎలా ఉంటుం దో కూడా వెల్లడించారాయన.

వెంకటేశ్ మాట్లాడుతూ.. “ఇప్పుడు నేను త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. మెగాస్టార్ చిరంజీవి మూవీలో అతిథి పాత్రలో నటిస్తున్నా.. అది చాలా ఫన్నీ ఉంటుంది. ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు. అంతేకాదు థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం3’ గురించి కూడా అప్‌డేట్ ఇచ్చారు వెంకీ. “మీనాతో కలిసి ‘దృశ్యం 3’లో నటిస్తున్నా.

ఇక ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో హిట్ కొట్టింది వెంకీ కాంబో. దీనికి సీక్వెల్ ఉంటుందని చెప్తూ.. ‘నాకు మంచి విజయాలను అందించిన అనిల్ రావిపూడితో మరో సినిమా చేయబోతున్నా’నని తెలిపారు వెంకటేశ్. మరో భారీ ప్రాజెక్టులో తన స్నేహితుడు బాలయ్యతో చేస్తున్నట్టు కూడా చెప్పారు.