19-08-2025 07:24:11 PM
సిద్దిపేట క్రైమ్: సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ బి.అనురాధ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, సీజ్ చేసిన వాహనాలు, రిసెప్షన్ రికార్డ్, రూంలను పరిశీలించారు. వీపీవోలు రెండు, మూడు రోజులకోసారి గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించాలన్నారు.
వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని ఎస్ఐని ఆదేశించారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇసుక, ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం అక్రమ రవాణా, జూదం అరికట్టడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, రూరల్ ఎస్ఐ రాజేష్ ఉన్నారు.