19-08-2025 07:30:00 PM
అవసరమైతే తప్ప బయటకు రావద్దు
ఎంపీడీవో సత్తయ్య
కొండాపూర్: భారీ వర్షాలు కురుస్తున్నందున కొండాపూర్ చెరువు అలుగు పరి ఆ నీరంతా మల్కాపూర్ చెరువులో కలుస్తుందని ఎంపీడీవో సత్తయ్య పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీవో సత్తయ్య కొండాపూర్, తెర్పోల్ మధ్య గల బ్రిడ్జినీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మధ్యలో కొండాపూర్, తెర్పోల్ మధ్య గల బ్రిడ్జిపై నుండి వరద పెద్ద మొత్తంలో ప్రవహిస్తుందన్నారు.
ఆ ప్రవాహంలో చేపలు కూడా మల్కాపూర్ చెరువులోకి వెళుతున్నాయన్నారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్లద్దని అన్నారు. అదేవిధంగా రెండు గ్రామాల నుంచి ఎవరు కూడా ఆ బ్రిడ్జి గుండా వెళ్ళకూడదని సూచించారు. బ్రిడ్జి వద్ద ఈ రెండు గ్రామాల పంచాయతీ సిబ్బంది, పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ మార్గం గుండా వెళ్లొద్దని కోరారు.