సీపీఐ 100 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
బాన్సువాడ,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ సిపిఐ పార్టీ కార్యాలయం ముందు సిపిఐ జెండాను బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ దుబాస్ రాములు ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించిందని ఆయన తెలిపారు.
బ్యాంకులను జాతీయకరణ చేయాలని, దున్నే వాడికి భూమి దక్కాలని, కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం అందాలని, వెట్టి చాకిరి నిర్మూలించాలని, అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన ఘన చరిత్ర సిపిఐ పార్టీకి ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి లక్షలాది ఎకరాల భూములను పంచిందని ఆయన తెలిపారు. సిపిఐ పార్టీ అభివృద్ధి కొరకు పార్టీ కార్యకర్తలు, కార్మిక సంఘాల సభ్యులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.






