26-12-2025 03:18:04 PM
క్రిటికల్ కేర్ బ్లాక్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో 23 కోట్ల 70 లక్షలతో నిర్మించిన ఆసుపత్రిని శుక్రవారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి కేంద్ర మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కేంద్రమంత్రి కి స్థానిక అధికారులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో వైద్య సేవలు మెరుగుకు కృషి చేయడం జరుగుతుందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి అన్నారు