01-05-2025 12:00:00 AM
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్
హుజూర్ నగర్, ఏప్రిల్ 30: పేదల ఆప్తురాలు పశ్య కన్నమ్మ అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం హుజూర్నగర్ లో మృతి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సిపిఐ నాయకురాలు పశ్య కన్నమ్మ మృతదేహంపై పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్ నగర్ లో మహిళా వైద్యురాలి కోసం, వితంతువుల పెన్షన్ కోసం, మహిళల ఆర్థిక స్వాలంబన కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు.
మహిళలు స్వశక్తితో ఎదగాలని అరుణ అసఫ్ అలీ భవన్ లో మహిళల కోసం అనేక అంశాలు శిక్షణా తరగతులు నిర్వహిస్తూ, సర్టిఫికెట్లను అందజేస్తూ వాళ్ల స్వశక్తితో వాళ్లు బతికేలా జీవనోపాధి కల్పించేందుకు మార్గం ఏర్పాటు చేశారన్నారు. పశ్య కన్నమ్మ మరణం, సిపిఐ పార్టీకి, మహిళలకు తీరని లోటని తెలిపి ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, మామిడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.