01-05-2025 12:00:00 AM
గూడూరు, ఏప్రిల్ 30: (విజ యక్రాంతి) పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పా ఠశాల విద్యార్థినిలు సత్తా చాటారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి జెడ్‌పీహెచ్ ఎస్ పాఠశాలకు చెందిన బి పరమేశ్వరి 579 మార్కు లతో మండలంలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది.
అదేవిధంగా గూడూరు మం డలం పొనుగోడు జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన ఎస్ శివాని 572 మార్కులు రాగా జి దివ్య 567 మార్కులు వచ్చాయి. అదేవిధంగా మండలంలో అధిక స్థాయిలో విద్యార్థులు విద్యా ర్థినిలు మంచి మార్కులతో పాసయ్యారు.