01-05-2025 12:00:00 AM
ములుగు, ఏప్రిల్ 30: కర్రెగుట్టల్లో మోహరించిన కేంద్ర ప్రభుత్వ పోలీసు బలగాలను వెనక్కి రప్పించి శాంతియుత వాతావరణం కల్పించాలని ప్రజాసంఘాల జేఏసీ ములుగు, హనుమకొండ జిల్లాల చైర్మన్లు ముంజాల బిక్షపతిగౌడ్, మాదాసి సురేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ములుగులో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
కొన్ని నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను చంపుతున్నారని ఆరోపించారు. విలువైన ఖనిజ సంపదను, సహజ వనరులను, కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసమే ఈ ఆపరేషన్ చేపట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసం ఘాల నాయకులు సోమ రామ్మూర్తి, సాయి ని నరేందర్, ఉపేందర్, బిక్షపతి, జైసింగ్ రాథోడ్, కొమురయ్య, లక్ష్మణ్, ఐలయ్య, అశోక్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.