calender_icon.png 9 January, 2026 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నిలిచిపోయేలా సీపీఐ సభ

07-01-2026 12:46:19 AM

బహిరంగ సభకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

ఆహ్వాన సంఘ కార్యదర్శి భాగం

రఘనాథపాలెం /ఖమ్మం డిసెంబర్ 6 (విజయక్రాంతి): చరిత్రలో నిలిచిపోయేలా సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జనవరి 18న నిర్వహిస్తున్నట్లు సిపిఐ జాతీయ సమితి -సభ్యులు, శతాబ్ది ఉత్సవాల ఆహ్వాన సంఘ కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి -లక్షలాది మంది ప్రజలు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో ఏపూరి లతాదేవి అధ్యక్షతన జరిగిన -సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జాతీయ స్థాయి సభ జరగడం ఇదే మొదటిసారి అని వందేళ్ల సిపిఐ సమర చరితను నేటి తరానికి తెలియజేయడంతో పాటు సమకాలిన రాజకీయ పరిస్థితులు, మతోన్మాద ప్రమాదం, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు -తదితర విషయాలను నేటి తరానికి తెలియజేసి భవిష్యత్తు పోరాటాలకు కార్యోన్ముఖులను చేసేందుకు ఈ సభ దోహదపడుతుందన్నారు.

ఖమ్మం ఎస్‌ఆర్‌ఆండ్బిజిఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగే ఈ సభకు అన్ని రాష్ట్రాల నుంచి సిపిఐ నాయకులు హాజరుకానున్నట్లు ఆయన -తెలిపారు. జనవరి 19 నుంచి 21 వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మం సప్తపది ఫంక్షన్హాల్లో జరుగుతాయన్నారు. 18న బహిరంగ -సభ సందర్భంగా స్థానిక పెవిలియన్ మైదానం నుంచి 15వేల జనసేవాదళ్ కార్యకర్తలు కవాతు చేస్తారని వీరితో పాటు కళాకారులు వృత్తి సంఘాలకు ప్రాతినిథ్యంవహిస్తూ ప్రజా సంఘాల కార్యకర్తలు ఆయా వృత్తుల వేషధారణలతో పాల్గొంటారని హేమంతరావు తెలిపారు.

శతాబ్ది -ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న జరిగే సభ జయప్రదం కోరుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించినట్లు =ఆయన తెలిపారు. కరపత్రాలు, పోస్టర్లు, జీపుజాతాల ద్వారా ప్రచారం జరిగిందన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో గడిచిన నాలుగు రోజులుగా జీపుజాతాలు నిర్వహించామని ఎనిమిదిన అన్ని మండలాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు జరుగుతాయని తొమ్మిదిన జిల్లా కేంద్రం ఖమ్మంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుందన్నారు. 10 నుంచి 14 వరకు కళారూపాల ప్రదర్శనలు ఉంటాయని ఆయన -తెలిపారు.

ఖమ్మంలో జనవరి 20న జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడం జరుగుతుందని ఈ సెమినార్కు అన్ని వామపక్షాల జాతీయ నాయకులు హాజరుకానున్నారని హేమంతరావు తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సిపిఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబి, వామపక్షాల నేతలు -దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు. భారతదేశం లో వామపక్ష ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే -అంశంపై జాతీయ స్థాయి సెమినార్ జరుగుతుందన్నారు.. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను పురస్కరించుకుని జనవరి 12న స్థానిక డిపిఆర్సి భవనం లో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు హే మంతరావు తెలిపారు.

ఈ కవి సమ్మేళనానికి ప్రముఖ కవులు సుద్దాల అశోక్ తేజ, కెవిఎల్ తో పాటు అభ్యుదయ కవులు ఖమ్మం జిల్లాకు చెందిన కవులందరిని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించి రచనలను సేకరించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక కవితల సంకలనాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 17న జాతీ య స్థాయి ఎడ్యుకేషన్ సబ్ కమిటీ సమావేశం అంతకు ముందు ప్రత్యేక కళారూపాల ప్రదర్శన జరుగుతుందని హేమం తరావు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, వివిధ ప్రజా సంఘా ల బాధ్యులు, ఆహ్వాన సంఘ విభాగాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.