21-11-2025 05:04:33 PM
నిర్మల్ రూరల్: కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ ను శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అభిలాష అభినవ్ ప్రజా పాలనలో ప్రభుత్వ పథకాల అమలులో స్ఫూర్తిదాయకంగా నిలవడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్ వైస్ ప్రెసిడెంట్ బైండ్ల శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రటరీ సీహెచ్ వినోద్ కుమార్, ట్రెజరీ అబ్దుల్ సాధిక్, కార్యనిర్వాహక సభ్యులు వసంత్ రావు తదితరులు పాల్గొన్నారు.