21-11-2025 05:00:50 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోమవార్ పేట ఉన్నత పాఠశాలలో జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మండల సాయి చెక్కు ముఖి టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు జిల్లా కన్వీనర్ అంకం గంగాధర్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ముగ్గురు విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేసి వారికి ప్రశంస పత్రాలను అందించారు. సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు ఆకుల సుదర్శన్ ఉపాధ్యాయులు ఉన్నారు