14-02-2026 12:34:45 AM
‘కూనంనేని’తో మాట్లాడి ఓపెన్ ఆఫర్ చేశాం
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడిందని, అందుకే సీపీఐకి మద్దతిస్తామని వారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణిలో సీఎం బామ్మర్ది కీలక పాత్రధారిగా, కింగ్ పిన్‌గా పాల్పడిన రూ.6 వేల కోట్ల బొగ్గు కుంభకోణాన్ని బీఆర్‌ఎస్ బయటపెట్టిన తర్వాత సీపీఐ తమతో కలిసి వచ్చి చెన్నూర్‌లోని క్యాతనపల్లిలో మున్సిపాలిటీలో ప్రచారం చేయడంతో, ఆ మున్సిపా లిటీని కూడా గెలుచుకున్నామని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేయడంతో వారిని నిరోధించడానికి మాతో కలిసి వచ్చే సీపీఐని కలుపుకున్నామని చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూ నంనేని సాంబశివరావుతో కూడా మాట్లాడానని, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణా లు, దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే డెఫినెట్‌గా మీతో కలిసి వస్తామని చెప్పినట్టు వివరించారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్, బీజేపీలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సీపీఐ తీసు కోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ తీసుకోండి అని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో కాంగ్రెస్, బీజేపీలను ఎండగట్టాలనే ఉద్దేశంతోనే ఓపెన్ ఆఫర్ ఇచ్చామ ని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా, అండగా నిలబడ్డ తమ్ముళ్లకి, చెల్లెళ్లకి అందరికీ ధన్యవాదా లు తెలిపారు.
నిజానికి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు ప్రజల మనసు గెలవడంలో విఫలమయ్యారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న పార్టీకి.. ముఖ్యంగా ఇంకో రెం డు మూడేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అధికార మార్పిడి కోసం జరిగేవి కాదనే ఆలోచన ఈ మధ్యనే దేశవ్యాప్తంగా ప్రజల్లో కనపడతున్నదని చెప్పారు.
దానికి భిన్నంగా ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్లు తిరగకముందే కాం గ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదా పు 40 శాతం(4 వేల సర్పంచులను) గ్రామ పంచాయతీలు బీఆర్‌ఎస్ పార్టీకి కట్టబెట్టారని గుర్తుచేశారు. అదే మాదిరిగా ఏదేదో మాట్లాడిన వారందరి నోళ్లు మూయించేలా మున్సిపల్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలే సాధించామని తెలిపారు.
పరాకాష్టకు అధికార దుర్వినియోగం
2020లో మొత్తం 130 మేయర్లకు, చైర్మన్లకు ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగా యని, అందులో డైరెక్టుగా 122 టీఆర్‌ఎస్ గెలిస్తే, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 2 గెలిచిందని గుర్తు చేశారు. ప్రస్తుతం డైరెక్టుగా బీఆర్‌ఎస్ 15 మున్సిపాలిటీలపైనే గెలువబోతున్నామని, దీంతోపాటు పరోక్షంగా మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న దగ్గర దాదాపు మరో 10, 15 చోట్ల మాకు అవకాశం ఉందన్నారు. మొత్తంగా చూసుకుంటే మంచి ఫలి తాలు వచ్చినట్టుగానే భావిస్తున్నామని తెలిపారు.
ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం, అధికా ర యంత్రాంగ దుర్వినియోగం పరాకాష్టకు చేరాయని విమర్శించారు. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ బేరసారాలు, ఎత్తుకు పోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడం వంటివి మొదలయ్యాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన వాళ్లను లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు బలంగా కొట్లాడారని తెలిపారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిం చి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తే కచ్చితంగా అదొక ఇండికేటర్‌గా పరిగణించవచ్చన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మేము సఫలమయ్యామని భావిస్తున్నామని తెలిపారు.
ప్రజల సమస్యలను ఎత్తుకోవడం, ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యం, 420 హామీల అమలు వైఫల్యం, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టడంలో, మైనారిటీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో, దళిత గిరిజనులకు ప్రభు త్వం ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయంలో, మహిళలు, యువకుల విషయంలో గానీ అందరికంటే అగ్రెసివ్‌గా ముందున్నది బీఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు.
మాకోసం కొట్లా డుతున్న వాళ్లు అనే భావన ఉన్నప్పుడు ప్ర జలు మాకే మద్దతు ఇస్తున్నారని చె ప్పా రు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో బయటపడిందన్నారు. అధికార పార్టీ 80--90 శాతం గెలిస్తేనే గెలిచినట్టు లేకపోతే అది ఏంగెలుపు కాదన్నారు.
ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే...
మంచి భవిష్యత్తు ఉంది అనడానికి మున్సిపల్ ఎన్నికలే నిదర్శమన్నారు. ఈ రాష్ర్టంలో కాంగ్రెస్‌ను గద్దె దించే, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు తేల్చడంతోపాటు ప్రత్యమ్నాయం, ప్రధాన ప్రతిపక్షమేనని స్పష్టం చేశాయన్నారు. రెండు జాతీయ పార్టీలు.. ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంటే, మరొకటి రాష్ట్రంలో అధికారంలో ఉందని, వాటిపై పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని తెలిపారు.
ఈ రెండు పార్టీలు ఎన్ని రకాల కుయుక్తులు పన్నినప్పటికీ బీఆర్‌ఎస్, కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని.. మళ్లీ ఒకసారి ఇటు పల్లెల్లో ఇటు పట్టణాల్లో ప్రజలు తేల్చినట్టు అయిందన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో గానీ, జిల్లా పరిషత్ ఎన్నికలు పెడితే వాటిలో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అధికార కాంగ్రెస్ దుర్మార్గాలు, అరాచకాలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఓడిపోయిన వారు ఎవరూ నిరాశ పడవద్దని, బేజారు కావద్దని విజ్ఞప్తి చేశారు.
స్థానిక నాయకత్వ మనోభావాల మేరకు హంగ్‌పై నిర్ణయం
రాష్ర్టంలో 124 చోట్ల ఎన్నికలు జరిగితే, 30 హంగ్ కాగా, 15 మేము గెలువగా, మిగతావి వాళ్లు గెలిచారని తెలిపారు. హంగ్ వచ్చిన చోట ఏ వైఖరి అవలంబించాలనే అంశంపై కేసీఆర్‌తో మాట్లాడతామని, స్థానిక నాయకత్వం మనోభావాలు కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. నేను రాజు నేను మంత్రి అనుకున్న వాళ్లని ఎంతో మందిని చూశామని, పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటారని.. అట్లాంటి వాళ్లు వస్తారు, పోతారు..ఎవరూ పర్మనెంట్ కాదని ఎద్దేవా చేశారు.
నేనే రాజు, నేనే మంత్రి అనుకున్న వాళ్లు చాలామంది అట్లాగే గాలికి కొట్టుకుపోయారని గుర్తు చేశారు. ఈ దేశం చాలా గొప్పదని, ప్రజల చైతన్యాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే వారు చాలా తెలివితక్కువ వాళ్లు అన్నారు. ఈ దేశంలో ఇందిరా గాంధీ ఓడిపోయారు, ఎన్టీ రామారావు ఓడిపోయారు, కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా కామారెడ్డిలో దురదృష్టవశాత్తూ ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు.
అట్లాగే రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్లు చాలామంది వచ్చారు, పోయారని చెప్పారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వచ్చి మేం గెలిచినం.. మాకు తిరుగులేదు, పొరుగు లేదని పోజులు కొడతారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో మురుగు నీరు నిర్వహణ బాగుందా, అక్కడ నీళ్లు వస్తున్నాయా లేదా, అక్కడ అభ్యర్థి ఓడిపోయాడా గెలిచాడా అనే అంశాలపై ఆధారపడి నడుస్తాయని తెలిపారు.