కల్లుగీత కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
- కల్లు గీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి
నిరసనగా ఇంద్ర పార్క్ వద్ద నిరాహార దీక్షను జయప్రదం చేయండి
కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు పాలకూర్తి శ్రీధర్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు తాటి లచ్చులు గౌడ్
కన్నాయిగూడెం,ఫిబ్రవరి13(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవూల తాటి వనంలో కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ను సొసైటీ అధ్యక్షులు తండ ప్రభాకర్ గౌడ్ అధ్యక్షతన ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు పాలకుర్తి శ్రీధర్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు తాటి లచ్చలు గౌడ్ హాజరై మాట్లాడుతూ కల్లుగీత కార్మిక న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుందని దీనికి కన్నాయిగూడెం మండలం నుండి కల్లుగీత కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని గీతా కార్మికులకు పిలుపునిచ్చారు






