calender_icon.png 10 October, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్య క్షేత్ర వ్యవస్థాపకులు జనార్దన్ స్వామి జయంతి వేడుకలు

10-10-2025 07:17:42 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి మహాక్షేత్ర వ్యవస్థాపకులు కీర్తిశేషులు కాకులారపు జనార్ధన్ స్వామి 46వ జయంతి వేడుకలను శుక్రవారం క్షేత్ర ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా జనార్ధన స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారిని స్మరించుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ జయంతి వేడుకలకు వివిధ ప్రాంతాల నుండి జనార్దన్ స్వామి మిత్రులు,కుటుంబ సభ్యులు, సూర్య భగవానుని భక్తులు తదితరులు పాల్గొన్నారు.