10-05-2025 12:21:53 AM
స్టార్ హీరో విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. శుక్రవారం విజయ్ 36వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన సినిమాల నుంచి మేక ర్స్ అప్‌డేట్స్ ఇచ్చారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ‘కింగ్‌డమ్’ మే 30న వస్తోంది. ఈ మూవీ కొత్త పోస్టర్‌లో విజయ్ రఫ్‌గా, ఇంటెన్స్ లుక్‌లో ఉన్నారు.
ఎస్‌వీసీలో రూరల్ యాక్షన్ డ్రామా..
విజయ్ దేవరకొండ హీరోగా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌లో ఓ క్రేజీ చిత్రం తెరకెక్క నుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. దర్శకుడు రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శక త్వం వహిస్తున్నారు. ‘ఎస్‌వీసీ59’గా పిలుచుకుంటున్న ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా రూపొందనుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.
బ్రిటిష్ కాలం నేపథ్యంతో ‘వీడీ14’
విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, మైత్రీ మూవీ మే కర్స్, టీ సిరీస్ కాంబోలో రూపొందుతున్న మూవీ ప్రస్తు తం ‘వీడీ14’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారం ఉంది. బ్రిటిష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకె క్కనుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
మేకర్స్ స్పెషల్ పోస్టర్‌తో విజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ధ్యానముద్రలో విజయ్ స్టిల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. షూటింగ్‌ను త్వరలో ప్రా రంభించనున్నారు. 1854 మధ్యకాలంలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది.