10-05-2025 12:20:42 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. ఈ చిత్రంలో అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లు కథానాయికలుగా నటిస్తున్నారు.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమాకు విడుదల తేదీని ప్రకటించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురూ కలర్‌ఫుల్ ఫెస్టివల్ వైబ్‌తో కనిపించి, ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: హరి కే వేదాంతం; సంగీతం: శ్రీచరణ్ పాకాల; మాటలు: సత్యర్షి, తూమ్ వెంకట్; సాహిత్యం: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, చైతన్యప్రసాద్, బాలాజీ, తిరుపతి; ఫైట్స్: రామకృష్ణ, నటరాజ్ మడిగొండ; ఆర్ట్: బ్రహ్మ కడలి; ఎడిటర్: చోటా కే ప్రసాద్.