10-05-2025 12:23:01 AM
భారత్ మధ్య చోటుచేసుకున్న తాజా పరిణామాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ విరాళాన్ని ప్రకటించారు. తమ బ్యానర్‌లో తెరకెక్కి, శుక్రవారం విడుదలైన ‘సింగిల్’ చిత్రబృందంతో కలిసి ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సినిమా కలెక్షన్లలో కొంత భాగాన్ని సైనికులకు అందజేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ‘మన సైనికులు దేశం కోసం పోరాడుతుంటే.. సినిమా విషయంలో మేం సెలబ్రేషన్స్ చేసుకోవడం సరికాదు అనిపించింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ ప్రెస్‌మీట్ పెట్టాం.
ఈ ఉద్రిక్త పరిస్థితులకు ముందు మేం ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించాం. సినిమా కోసం వందల మంది పనిచేయడమే కాదు థియేటర్లపై వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎవరూ తప్పుగా అర్థం చేసుకోరన్న ధైర్యంతో సినిమాను విడుదల చేశాం’ అని అరవింద్ వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో నాయకానాయికలు శ్రీవిష్ణు, ఇవానా, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.
సైన్యానికి ‘దేవరకొండ’ విరాళం ప్రకటన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న
పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం నేర్పేందుకు భారత సైన్యం ముందడుగు వేస్తోంది. ఇలాం టి సమయంలో తన బాధ్యతగా ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించారు హీరో విజయ్ దేవర కొండ.
రాబోయే కొన్ని వారాలపాటు తన క్లాత్ బ్రాండింగ్ ‘రౌడీ వేర్’ అమ్మకాల్లో వచ్చే లాభాల్లో కొంత వాటాను భారత సైన్యానికి విరాళం ఇవ్వనున్నట్టు విజయ్ ప్రకటించారు. ‘మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు రౌడీ హీరో.