23 June, 2026 | 1:33 AM

మాదక ద్రవ్యలపై విద్యార్థులకు అవగాహన

23-06-2026 12:00 AM

రేగోడ్, జూన్ 22: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు  ఎస్త్స్ర పోచయ్య మోడల్ స్కూల్లో సోమవారం  విద్యార్థులకు మాధక ద్రవ్యలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తి గత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు ఇతరులను కూడా అప్ర మత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.