23 June, 2026 | 1:33 AM

అందమైన బాన్సువాడ కోసం ప్రజలు సహకరించాలి

23-06-2026 12:00 AM

మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్

బాన్సువాడ, జూన్ 22 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పురపాలక సంఘము పరిధిలో గల (19) వార్డులకు గాను వర్షాకాలం దృష్ట్యా ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలను విడతల వారిగా నిర్వహించడం జరుగుతుందని అందమైన బాన్సువాడ కొరకు ప్రజలందరూ సహకరించాలని పురపాలక సంఘ కమీషనర్ గోపు గంగాధర్ తెలిపారు. ఇందులో భాగంగా నేటి నుంచి సోమవారం రోజున వార్డు నెం. 3 కొయ్యగుట్ట,  ఇస్లాంపుర, 13 వార్డు టీచర్స్ కాలనీలలో గల పేరుకుపోయిన డ్రైనేజీల్లోని పూడికను పారిశుద్య కార్మికులచే శుభ్రపరచడం జరిగినది. కాలనీలో అస్తవ్యస్థంగా ఉన్నటువంటి డ్రైనేజీలను శుభ్రపరిచి మురికి నీరు ప్రవహించేలా తగు చర్యలు తీసుకోవడం జరిగినది. 

ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాన్ని నేటి నుండి వచ్చే నెల 03వ తేదీ వరకు అన్ని వార్డుల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పట్ణణ ప్రజలు ఎక్కడైతే మురికి నీరు ఇబ్బందులు ఉన్నట్లైతే పురపాలక సంఘ కార్యాలయానికి సంప్రదించాలని కమీషనర్ గోపు గంగాధర్ సూచించారు. ఇట్టి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ హకీం, 13వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ ఖాలేక్,  కాసుల రోహిత్, ఖమర్ సుల్తానా గౌస్ కార్యాలయ సిబ్బంది, పారిశుద్య కార్మికులు, కాలనీ వాసులు పాల్గొనడం జరిగినది.