calender_icon.png 1 July, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యమపాశాలు.. పరిశ్రమలు!

01-07-2025 02:26:38 AM

  1. పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో వరుస ప్రమాదాలు
  2. ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు
  3. నియంత్రించడంలో అధికారుల విఫలం
  4. మచ్చుకైనా కనిపించని నిబంధనలు 
  5. పట్టించుకోని ప్రభుత్వం.. పాలకులు?

సంగారెడ్డి, జూన్ 30 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో వందలాది ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజ లు ఉపాధి నిమిత్తం ఇక్కడకు వచ్చి జీవిస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడకు నెలవుగా మారిన పటాన్‌చెరు మినీ ఇండియాగా గుర్తింపు పొందింది. ఉపాధి కల్పించే పరిశ్రమలు నేడు యమపాశాలుగా మారుతున్నాయి.

నిబంధనలు పాటించకపోవడంతో చాలా వరకు కెమికల్ ఫ్యాక్టరీలు ప్రమాదాలకు గురవుతూ కార్మికుల ప్రాణాలు హరిస్తున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీల్లో రియాక్టర్లు, ఎయిర్ డ్రయర్లు పేలిపోవడంతో ఎందరో కార్మికులు చనిపోవ డం, తీవ్రస్థాయిలో గాయాలపాలవడం పరిపాటిగా మారింది.

పటాన్‌చెరు నియో జకవర్గంలోని ఐడీఏ బొల్లారం, పాశమైలా రం, జిన్నారం తదితర ప్రాంతాల్లో వందలా ది ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో కెమికల్ ఫ్యా క్టరీలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. తాజాగా పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి ౧౯ మంది మృతి చెందగా మరో ౨౨ మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 1౨ మంది వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో జరిగిన ఘటనలో ఇదే పెద్ద ప్రమాదం కావడం గమనార్హం. 

ప్రమాదాల పరంపర

పారిశ్రామిక వాడలో జరిగిన కొన్ని సం ఘటనలను పరిశీలిస్తే.. జిన్నారం  మండలం ఐడీఏ బొల్లారంలోని శ్రీకర ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో అక్కడ పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బొల్లారంలో పీఎన్‌ఎం లైఫ్ సైన్స్‌లో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇక్కడ కూడా ఎయిర్ డ్రయర్‌లో ఒత్తిడి వల్లే ప్రమాదం జరిగినట్లు తేల్చారు. ఈ కంపెనీలో పది మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం. అలాగే ఐడీఏ బొల్లారంలోని వింద్యా ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కూడా అప్పట్లో సంచలనం రేకెత్తించింది. సోమవారం పాశమైలారం సిగాచి కంపెనీలో జరిగిన ఘటన అత్యంత దారుణమైంది. 

నిబంధనల ఉల్లంఘనతోనే...

అనేక పరిశ్రమల్లో ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అధికారులు పరిశ్రమల్లో రికార్డులకే తనిఖీలు చేసి వెళ్తున్నారు తప్పా క్షేత్రస్థాయిలో పరిశ్రమలను తనిఖీ చేయడం లేదు. క్షేత్రస్థాయిలో పరిశ్రమలను తనిఖీ చేస్తే లోపాలు గుర్తించి, పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలి.

ఏటా వేసవికి ముందే పరిశ్రమలను తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రాలు అగ్నిమా పక శాఖ అధికారులు అందజేయాల్సి ఉంటుం ది. పారిశ్రామికవాడల్లో అసలు చాలా పరిశ్రమలకు అనుమతులు లేకుండానే నడుస్తున్న ట్లు సమాచారం. రసాయన పరిశ్రమల్లో ప్ర మాదాలు జరిగిన సమయంలో అధికారులు హడావుడి చేస్తున్నారు తప్పా కఠిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. 

కనిపించని సేఫ్టీ అథారిటీ

ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడకు నెలవైన పటాన్‌చెరులో కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. పరిశ్రమల్లో పని చేసేందుకు కార్మికులను కాంట్రాక్టర్లు తీసుకువస్తున్నారు. కానీ, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పరిశ్రమల యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తు న్నారు.

దీంతో ప్రమాదాలు జరిగినప్పు డు కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా రు. ప్రమాదాలు జరిగినప్పుడే కార్మిక శాఖతోపాటు సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారు తప్పా మిగ తా సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.  పరిశ్రమల సేఫ్టీ అథారి టీ అధికారులు కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదు.