calender_icon.png 2 February, 2026 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్తారు

02-02-2026 12:00:00 AM

ఏమ్యెల్యే బండారి లక్ష్మారెడ్డి 

కుషాయిగూడ/సికింద్రాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : కెసిఆర్‌ని సీట్ విచారణ పేరుతో రాజకీయ వేదింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బిఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు మరియు ఉప్పల్ నియోజకవర్గం ఏమ్యెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశానుసారం రాధిక చౌరస్తాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం రాస్తారోకో చేసి రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని నినాదాలు చేస్తూ నిరసన తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ అధ్యక్షులు కాసం మహిపాల్ రెడ్డి, కార్యదర్శి కుమార స్వామి, షేర్ మానెమ్మ, కైప శిరీష రెడ్డి, ఎస్.ఏ. రహీమ్, బడేటి చిన్న, సత్తమ్మ, మాట్ల గిరి, దుర్గా, మొగులయ్య, ఆనంద్, శ్రీను గౌడ్, రమేష్ చారి, కృష్ణ, చిన్నారావు, గోవర్ధన్ చారి, సంభాశివరెడ్డి, భాస్కర్, పాషా, సదాశివ చారి, సకినాల రవి, సత్యనారాయణ గౌడ్, ప్రమోద్, భవానీనగర్ మొగులయ్య, సత్యనారాయణ, మల్లేష్, పంతుల్ నర్సింహ, వేణు, సురేష్, కుమారస్వామి, దేవిరాజు, నాను, దినేష్ మరియు యువ కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్‌పై కక్ష సాధింపు రాజకీయాలు

సికింద్రాబాద్ : కేసీఆర్ పై సిట్ విచారణ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ రాజకీయ వేధింపులకు నిరసనగా ఓల్ బోయిన్ పల్లి బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నాయకత్వం లో రాస్తారోకో నిర్వహించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసి,కేసీఆర్ కు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావంగా తెలంగాణ భవనకు బయలుదేరి వెళ్లారు.

కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ నీ ఫోన్ టాపింగ్ అంటూ, సిట్ విచారణ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో శనివారం కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బిఆర్‌ఎస్ నాయకుడు, సోషల్ మీడియా అధికార ప్రతినిధి మన్నే క్రిశాంక్ కంటోన్మెంట్ నివాసం నుండి నాయకులు, కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్ వరకు కెసిఆర్ కి మద్దతుగా సిట్ నోటీస్ ఇవ్వడం పట్ల నిరసన తెలుపుతూ, నల్ల జెండాలతో భారీ బైక్ ర్యాలీ గా తెలంగాణ భవన్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ సోషల్ మీడియా అధికార ప్రతినిధి మన్నే క్రిశాంక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్యసాధింపు పాల్పడు తోందని ఆరోపిస్తూ కేసీఆర్‌పై అక్రమంగా కేసులు బనాయించి రాజకీయంగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.