02-01-2026 10:11:24 PM
- నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పిలుపు
కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న ఎంఐఎం పార్టీదే సూపర్ పవర్ అని, ఎంఐఎం మద్దతు లేనిదే ఆకు కూడా కదలదని, రాష్ట్ర రాజకీయాల్లో ఎంఐఎం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో ఎంఐఎం పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా శ్రమించాలని హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎంఐఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సులో మాజీద్ హుస్సేన్ మాట్లాడారు.
ఈ దేశం అందరిదని ఈ దేశంలో అందరికీ సర్వసమాన హక్కులు ఉన్నాయని, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశవ్యాప్తంగా దళిత, ముస్లింల అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాల గొంతుకగా పార్లమెంట్ వేదికగా పోరాడుతున్నారని తెలిపారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 20స్థానాల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేయబోతుందని, కనీసం 18స్థానాల్లో విజయం సాధించి మున్సిపల్ కార్పొరేషన్ పై ఎంఐఎం పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. 2028 రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, నాయకులు బర్కత్ అలీ, సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్, ఖాజా ఖురేషి, ఖమరొద్దీన్, ఆతిఫ్ ఆతిన, ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్లు అఖీల్ ఫిరోజ్, శర్ఫుద్దీన్, మాజిద్ హుస్సేన్, అరిఫ్ అహ్మద్, అసదుల్లా బేగ్, అలిబాబా, అజర్ దబీర్, మొహసీన్ మొహియుద్దీన్, సాజిద్, ఖాజా మజారోద్దీన్, వాజిద్ అలీఖాన్, అబ్దుల్లా అసిమ్, తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.