02-01-2026 09:59:23 PM
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): స్టేట్ టీచర్స్ యూనియన్ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ శుక్రవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల్లో పుస్తక పఠనం, గ్రంథ పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన చోట గ్రంథాలయ నిర్వహణకోసం చరిత్ర,పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందజేయనున్నట్లు తెలియజేశారు. పదవ తరగతి ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.