02-01-2026 09:56:59 PM
వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా సిద్ధం
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ దిశగా మున్సిపల్ అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాండూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న 36 వార్డులకు గాను ఓటర్ల జాబితాను విడుదల చేశారు.
పురుషులు 37,547, మహిళలు 39,558 ఓటర్లు ఉండగా ఇతరులు ఐదు మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. వార్డుల వారీగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు రిజర్వేషన్లు ఎలా వస్తాయో అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు.