calender_icon.png 3 January, 2026 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డిలో విస్తృతంగా వాహనాల తనిఖీ

02-01-2026 10:13:51 PM

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తాలో ప్రత్యేక తనిఖీలు

సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరవారి రాజారెడ్డి

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం ఎల్లారెడ్డిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రాజారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనదారుల వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (అర్ సీ), ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు.

వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే చెల్లించాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. అదేవిధంగా, టూ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసు అధికారులు హెచ్చరించారు. రహదారి భద్రత అందరి బాధ్యత అని, ప్రమాదాలు నివారించేందుకు నియమాలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.