సేంద్రియ విధానంలో పండించిన పంటకు మంచి డిమాండ్
17-04-2026 01:47 AM
కేసముద్రం, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రసాయన ఎరువులతో కాకుండా సేంద్రీయ విధానం ద్వారా పండించిన పంట ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, రైతులకు ఆశించిన మేరకు దిగుబడి, ఆదాయం లభిస్తుందని ఏ ఈ ఓ నైనాల భాస్కర్ అన్నారు. ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామంలో సేంద్రీయ పంటల సాగు విధానంలో రైతు పెండెం వెంకన్న సాగుచేసిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ రైతులు తమ సాగు చేస్తున్న పంట విస్తీర్ణంలో కొంత భాగాన్ని సేంద్రీయ పద్ధతి ద్వారా పంటలు చేయాలని పిలుపునిచ్చారు.






