calender_icon.png 10 May, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు గ్యారెంటీలకు రూ.56,084కోట్లు

20-03-2025 12:00:00 AM

2024-25 బడ్జెట్ కంటే రూ.9వేల కోట్లు ఎక్కువ కేటాయింపులు

  1. ఇతర ప్రాధాన్య పథకాలకు రూ.48,245కోట్లు
  2. చేయూత, రాజీవ్ యువవికాసం పథకాలకు ప్రాధాన్యం..

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): 2025-26 బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం బడ్జెట్‌లో 18శాతం నిధులను వీటికే కేటాయించింది. 2024-25లో రూ.47వేల కోట్లను కేటాయించిన సర్కారు ఈ పద్దులో రూ.56,084కోట్లు ప్రతిపాదించింది. ఇందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్‌ను ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించింది.

దీంతో ఈ రెండు పథకాలకు కలిపి రూ.18,600కోట్లు అంచనా వేసింది. సన్న వడ్లకు చెల్లించే బోనస్‌ను కూడా భారీగా పెంచింది. గతేడాది రూ.1,119కోట్లు ప్రతిపాదించగా.. ఈసారి రూ.1,800 కోట్లను అంచనా వేసింది. ఆరు గ్యారెంటీల్లో చేయూత స్కీమ్‌కు రెండో ప్రాధాన్యం ఇచ్చింది. ఈ స్కీమ్‌కు రూ.14,861 కోట్లు కేటాయించింది.

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువవికాసం, రైతులు, పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి కార్యక్రమాలకు కలిపి రూ.48,245కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మేజర్ స్కీమ్స్‌గా భావించిన వాటికి రూ.1,04,329కోట్లు కేటాయించింది.

ఆడబిడ్డల పెళ్లికి సాయం చేయడానికి అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నిధులను పెంచింది. 2024-25లో రూ.3,585కోట్లను కేటాయించిన సర్కారు.. ఈసారి రూ.3,683 కోట్లు అంచనా వేసింది.

ఇతర కీలక పథకాలు(రూ.కోట్లలో)

పవర్ సబ్సిడీ 11,500

రాజీవ్ యువవికాసం 6,000

స్కాలర్‌షిప్స్ అండ్ స్టుఫైండ్స్ 4,452

కల్యాణ లక్ష్మి/షాదీముబారక్ 3,683

నియోజకవర్గ అభివృద్ధి నిధులు 3,300

రైస్ సబ్సిడీ 3,000

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ 

రెసిడెన్షియల్ స్కూల్స్ 2,900

డైట్ చార్జీలు 2,659

పరిశ్రమల ప్రమోషన్ ఇన్సెంటీవ్స్ 1,730

రైతుబీమా 1,589

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని 

రుణాలు 1,511

గ్రామాల్లో సోలార్ పథకం 1,500

గ్రీన్ ఎనర్జీ 1,000

నగరాభివృద్ధి 1,000

టూరిజం ప్రాజెక్టులు 721

ఇందిరా గిరి జల వికాసం 600

యూనివర్సిటీల్లో 

మౌలిక వసతులు 500

హ్యామ్ రోడ్లు 500

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి 100

మొత్తం 48,245