10-05-2025 07:56:40 PM
కరీంనగర్,(విజయక్రాంతి): దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండి జాతీయతను చాటాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. శనివారం పట్టణంలోని మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం భారత సైనికులకు మద్దతుగా కరీంనగర్ గోవిందపతి సేవా సంస్థ, శ్రీ సేవమార్గ సంస్థ, నగర కిట్టి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో వినూత్నంగా సింధూరంతో కూడిన చేతి ముద్రలను తెల్లటి వస్త్రంపై ఉంచి భారత ప్రభుత్వానికి పంపించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హజరై తన మద్దతు తెలిపారు. అనంతరం నగరవీధుల గుండా జాతీయ జెండాలను చేత భూని ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై , జై జవాన్, అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ... దాయదీ దేశానికి వనుకు పుట్టేలా కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి గర్వకారణం అన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా అందరు ఒక్కటై కేంద్ర ప్రభుత్వానికి, భారత ఆర్మీ కి మద్దతు ఇవ్వాలని కోరారు. టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనతో తన ఒక నెల వేతనాన్ని ఆర్మీకి పంపించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సేవమార్గ్ సంస్థ అధ్యక్షురాలు మునిపెల్లి ఫణిత, గోవింద పతి శ్రీవారి సేవా సంస్థ ఫౌండర్ చైర్మెన్ పాలవేడు శ్రీనివాస్, పడకంటి ఇందు, నకిరేకొమ్ముల పద్మ, సరళ, కిట్టి మహిళలు భాగ్య, సుమ, మరియు గోవింద పతి శ్రీవారి సేవకులు, ప్రజలు పాల్గొన్నారు.