10-05-2025 06:54:36 PM
బైంసా,(విజయక్రాంతి): రాష్ట్ర ఉన్నత అధికారుల ఆదేశం మేరకు బాసరలో మరింత భద్రత చర్యలను చేపట్టినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శనివారం బాసర ఆలయంతో పాటు రైల్వేస్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చేపట్టవలసిన భద్రత చర్యలపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిరంతరంగా తనిఖీలు చేయాలని ఎస్పీ అవినాష్ కుమార్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐ మల్లేష్ ఎస్సైలు పాల్గొన్నారు.