calender_icon.png 11 May, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ప్రత్యేక పూజలు ప్రార్థనలు

10-05-2025 07:12:49 PM

భైంసా,(విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సామాన్య ప్రజలు టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ భారత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని కోరుతూ ఆదివారం పూజలు ప్రార్థనలు చేయాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. ఆదివారం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో హిందూ దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదుల్లో పూజలు నిర్వహించి భారత సైన్యానికి ప్రజలు అండగా ఉంటామని భరోసా కల్పించవలసిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి పై ఉందని గుర్తు చేశారు.