10-05-2025 07:46:33 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మహిళను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. ఆదిలాబాద్ కు చెందిన ఓ మహిళను పంజాబ్ లోని అమృత్‌సర్ కు చెందిన మనీష్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేశాడు. మహిళ పేరిట ఫేక్ ఫేస్ బుక్ ఐడి ని క్రియేట్ చేసి ఫేస్ బుక్ లో మహిళ చిత్రాలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేయడంతో పాటు, లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగిందని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ బృందం సహాయం నిందితుని అమృత్‌సర్ లో అరెస్టు చేసి ఆదిలాబాద్ రప్పించి కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సునీల్ కుమార్ పేర్కొన్నారు.