calender_icon.png 11 May, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలకు చేరిన గంజాయి

10-05-2025 07:52:38 PM

మోతి ఘనపూర్ లో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): నగరాలు పట్టణాలకే పరిమితమైన గంజాయి ఇప్పుడు గ్రామాలకు చేరుకుంది. ప్రభుత్వం గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటున్న పట్టణాలు నగరాల నుంచి కూడా గ్రామాలకు చేరుతుందంటే గంజాయి వ్యాపారం ఎలా జరుగుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లాలోని బాలానగర్ మండలం లోని మోతి ఘనపూర్ గ్రామంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు  మోతి ఘనపూర్ గ్రామానికి యాక్టివా స్కూటీ పై వచ్చి 750 గ్రాముల గంజాయిని అమ్మడానికి గ్రామంలో తిరిగారు. వీరు తిరిగిన విధానం తో అనుమానం వచ్చి కొందరు వ్యక్తులు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించారు.  దీంతో గంజాయి అమ్మే వారు రెడ్ అండ్ గా పట్టుబడడంతో మూడు సెల్ ఫోన్లు 750 గ్రాముల గంజాయి యాక్టివ్ స్కూటీని బాలనగర్ ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ విప్లవ రెడ్డి తెలిపారు.