calender_icon.png 11 May, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

10-05-2025 07:49:19 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శృతి సింధూనూరి అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ సహస్ర చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిబిరంలో 150 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు. అలాగే ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న దంపతులకు సంతాన సమస్యలపై సమగ్రమైన వైద్య సలహాలు, సూచనలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు షరీఫా ఫాతిమా, సోఫియా బేగం, తదితరులు పాల్గొన్నారు.