calender_icon.png 11 May, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాల తనిఖీలు చేపట్టిన ఎస్సై విజయ్ కొండ

10-05-2025 07:32:55 PM

మద్నూర్,(విజయక్రాంతి):  కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్‌పూర్ చెక్ పోస్ట్ ఎస్ఐ విజయ్ కొండ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని, శనివారం సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విజయ్ కొండ మాట్లాడుతూ... సరైన అనుమతి పత్రాలు లేని వాహనాలు, నంబర్ ప్లేట్స్ తప్పుగా వున్న వాటిని, నంబర్ ప్లేట్స్ లేని వాహనాలను తనిఖీ చేసి యజమానులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనదారులు అన్ని రకాల అనుమతి పత్రాలు వెంట ఉంచుకోవాలని ట్రాఫిక్ నియమాలు తప్పని సరిగా పాటించాలని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని కార్లు నడిపే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వాహనదారులు పెండింగ్ ఉన్న ఈ చలాన్లను వెంటనే చెల్లించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..