27-07-2025 01:28:52 AM
హైదరాబాద్, జూలై 26 (విజయ క్రాంతి): తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్‌ఐడీసీ)కి రూ. 340 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీ.కే శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ. 25 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధా ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.