calender_icon.png 27 July, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రేషన్ కార్డులు

27-07-2025 01:27:15 AM

- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

- పెద్ద అంబర్‌పేట్‌లో రేషన్‌కార్డుల పంపిణీ

అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 26: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామని ఐటీ శా ఖ, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్‌లో శనివారం మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ సి నారాయణరెడ్డితో కలిసి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బా బు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నా రు.

తాము కేవలం అబ్దుల్లాపూర్‌మెట్ మం డలం, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలకు 10,050 రేషన్ కార్డులు కొత్తగా మంజూరు చేశామని తెలిపారు. గతంలోసిండికెట్ రాకె ట్లుగా ఏర్పడి రేషన్ అమ్ముకుని రీసైక్లింగ్ చేసేవారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభు త్వ హయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో మాట్లాడి తుర్కయంజాల్ మున్సిపాలిటీకి రూ.100 కోట్లు, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, అదే విధంగా నియోజకవర్గానికి సంబంధించి ఆర్‌అండ్ బీ రోడ్లకు సంబంధించి రూ.25 కోట్లలను మంజూరు చేయించుకుని ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని.. మెరుగైన రో డ్లు, మౌలిక సదుపాయాలు ఉండాలని మంత్రులతో, అధికారులతో మాట్లాడి నిధులను తెచ్చుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడని ఎమ్మెల్యే పై ప్రశంసలు జల్లు కురిపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను చూసి ఒర్వలేక.. ఈర్ష్య, అసూయతో సోషల్ మీడియా ద్వారా మరియు ఇతర మీడియాల ద్వారా మా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.