calender_icon.png 27 July, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

28 నుంచి ఎన్‌హెచ్‌ఆర్సీ బహిరంగ విచారణ

27-07-2025 01:31:55 AM

109 కేసులను విచారించనున్న కమిషన్

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఈనెల 28, 29వ తేదీల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక బహిరంగ విచారణ ద్వారా కేసులను పరిష్కరించనున్నది. తెలంగాణకు చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించనున్నది. రాష్ర్ట అధికారులు, ఫిర్యా దుదారుల సమక్షంలో వేగంగా న్యా యాన్ని అందించేందుకు హైదరాబాద్‌లో రెండు రోజులు పాటు ప్రత్యేక బహిరంగ విచారణ చేపట్టనుంది.

జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎన్‌హె చ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ జస్టిస్ వి. రామసుబ్రమణియన్, సభ్యులు జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి, విజయ భారతి సయానితోపాటు ఇతర అధికారులు దీనికి హాజరుకానున్నారు.

విచారణ చేపట్టనున్న కేసుల్లో పోలీసుల అధికారుల దుర్వినియోగం, ప్ర భుత్వం ఇచ్చే వివిధ సామాజిక సం క్షేమ పథకాల కింద ప్రయోజనాలను తిరస్కరించడం, జైళ్లలో అక్రమాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన మానవ హక్కులను పరిరక్షించడంలో నిర్లక్ష్యం, రాష్ర్టవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న వి ద్యార్థుల హక్కులు, ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఎదుర్కొం టున్న ఆరోగ్య సమస్యలు, అక్రమ రవాణా వంటివి ఉన్నాయి.