14 July, 2026 | 8:02 AM

ఉప్పల్ అభివృద్ధికి 2.85 కోట్లు మంజూరు

24-09-2025 01:27 AM

ఉప్పల్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్ 2.85 కోట్లు మంజూరు చేశారు. ఉప్ప ల్‌లోని శ్రీనగర్ కృష్ణారెడ్డి నగర్‌లో నీ 550 మీటర్ స్టాంప్ వాటర్ డియిన్ నిర్మాణానికి ఈ నిధులు కేటాయించారు.

సాయి నగర్ ఆర్చ్ నుండి టిఎఫ్‌ఐఆర్ వరకు కృష్ణానగర్ రోడ్ నెంబర్ 1.2 కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని అంచనాల రూపొందించాలని కమిష నర్ ఆదేశించారు. అభివృద్ధి పనులకు నిధు లు కేటాయించినందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు