24-09-2025 01:26:28 AM
-పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
-దుబాయ్, మస్కట్‌లో బాధితుల కోసం ప్రత్యేక బోర్డు
-గాంధీభవన్‌లో పీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : పూల వేడుక బతుకమ్మకు గిన్నిస్ రికార్డులో చోటు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలనలో ప్రజల బతుకమ్మగా సంబురాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. టీ పీసీసీ ఎన్‌ఆర్‌ఐసెల్ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీభవన్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహేష్‌కుమార్ మాట్లాడుతూ గల్ఫ్ బాధితుల కోసం ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకొస్తుందని, దళారుల కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
దుబాయ్, మస్కట్‌లో బాధితుల కోసం పత్యేక బోర్డు ఏర్పాటు చేశామన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు లేరని, పార్టీ కార్యకర్తలు బతుకమ్మ ఏర్పాట్లు చేసే విధంగా ఆదేశాలు ఇ వ్వాలని పీసీసీ చీఫ్‌ను కోరారు. మేయర్ విజయలక్ష్మి, సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల గద్దర్, గల్ఫ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఐ వినోద్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, రైతు కమిషన్ సభ్యులు భవానిరెడ్డి, బొజ్జ సంధ్యారెడ్డి పాల్గొన్నారు.