భక్త జన సంద్రం.. భద్రాచలం
- స్వామి వారి కల్యాణాన్ని తిలకించిన భక్తజనం
- ఉదయం నుంచి సందడే సందడి
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): లోక కళ్యాణం గా భావించే శ్రీ సీతారాముల కళ్యాణం దక్షిణ అయోధ్యగా పేరుందిన భద్రాచలం లో ఆదివారం కన్నుల పండగ సాగింది. స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు దేశ నలమూలల నుంచి లక్షలాది మంది భక్తులు భద్రాచలం చేరుకున్నారు.
దీంతో భద్రాచలం జనసంద్రమైంది. ఉదయం 10:30 గంటలకు మిథిలా మైదానంలో ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం మధ్యా హ్నం 12:30 గంటల వరకు కన్నుల పండగ సాగింది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా ఆలయ అధికారులు ఏర్పాటులు నిర్వహించారు. చలువ పందిర్లు కు బదులు షామియానాలు వేయడంతో భక్తులు ఉక్కపోతతో కొంత ఇబ్బందికి గురయ్యారు. గతంలో తాటాకుల పందిర్లు వేయడం వల్ల చల్లగా ఉండేదని, ప్రస్తుతం శామ్యానాలు వేయడంతో ఉష్ణోగ్రత అధికంగా ఉండటంతో కొంత ఇబ్బంది పాలయ్యామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్వామివారి కళ్యాణం తిలకించేందుకు ప్రభుత్వం ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించారు. రూ 2000 చెల్లించి కూడా భక్తులు కళ్యాణాన్ని తిరగించలేని పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఆన్లైన్ టికెట్ తీసుకొని సెక్టార్ లోకి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది భక్తులు నిరాశ గురయ్యారు. ప్రోటోకాల్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తామన్న అధికారులు ఆచరణలో విఫలం కావడంతో డబ్బులు చెల్లించి కూడా భక్తులు కళ్యాణం చూడకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
9 సంవత్సరాలు తర్వాత అధికారికంగా తలంబ్రాలు
అనాదిగా స్వామివారి కల్యాణానికి అధికారికంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం సమర్పిస్తూ వస్తుంది. రాజుల కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రోజుల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించేవారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఒకటి, రెండు పర్యాయాలు మాత్రమే ఆచారం కొనసాగింది. గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ వ్యవహారం బ్రేక్ పడింది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు సమర్పించారు.
కళ్యాణం తిలకించేందుకు పోటెత్తిన భక్తులు
వైరా :-వైరా మండలంలో అన్ని గ్రామాలలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరిం చుకొని వాడవాడల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. వైరా శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో అత్యంత వైభవపీతంగా స్వామి వారి కళ్యా ణం మంత్రోచ్ఛరణతో ఘనంగా కళ్యాణ నిర్వహించారు.
మండలంలోని గొల్లపూడి శ్రీ పులిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వైరా శిరిడి సాయిబాబా మందిరం శ్రీ హరిహర సుత అయ్యప్ప క్షేత్రం సోమవరం దాసాంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణం నిర్వహించారు అన్ని దేవాలయాల్లో రామనామ జపంతో భక్తులు హోరెత్తించారు కళ్యాణం తిలకించేందుకు భక్తులు పోటెత్తారు స్వస్తిశ్రీ వ్యవహారిక చాంద్రమానైన శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం చైత్ర మాస శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర యుక్త అభిజిత్ లగ్నం సుముహూర్తమున అయోధ్య నగరాధీశులు శ్రీ దశరథ మహారాజు జేష్ట పుత్రుడు శ్రీరామచంద్రమూర్తికి మిధుల నగరాధీశులు శ్రీ జనక మహారాజు జేష్ట పుత్రిక శ్రీ సీతాదేవితో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ఐదు నిమిషాలకు దేవాలయాల్లో కళ్యాణం నిర్వహించారు.
గ్రామీణ ప్రాంత ప్రజల తమ గోవులను ఎద్దులు గొర్రెలను దేవాలయం ప్రాంగణం చుట్టూ తిప్పి పూజలు నిర్వహించారు. శ్రీ కోదండ రామస్వామి దేవాలయం శ్రీ శిరిడి సాయిబాబా మందిరం లో భాజా భజంత్రీలు సందడితో రాములోరీ కళ్యాణం కమనీయంగా కన్నుల పండుగ జరిగింది ఈ అపురూప దృశ్యాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు దేవాల యాల్లో పోటీత్తారు.
శ్రీరామ జై రామ జై జై రామ అంటూ శ్రీరామ నామస్మరణతో ఎటు చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామ జపంతో భక్తజనం సందోహం పులకించింది శ్రీ కోదండరామ స్వామి దేవాల యంలో మిట్టపల్లి నాగేశ్వరరావు( గోల్ షాప్) అనురాధ దంపతులు మిట్టపల్లి జగన్మోహన్రావు మహాలక్ష్మి దంపతులు మిట్ట పల్లి శ్రీనివాసరావు మంజుల దంపతులు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నంబూరి రామారావు శ్రీదేవి దంపతులు లగడపాటి బోస్ దంపతులు, రాయల శ్రీనివాసరావు రోజా దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణం నిర్వహించారు.
శ్రీ కోదండ రామాలయంలో స్వచ్ఛంద సంస్థ శ్రీ వైష్ణవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మజ్జిగ వాటర్ ప్యాకెట్లను అందించారు భక్తులకు ప్రసాదాలను సాకేత్ కృష్ణ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పెరుమాల కృష్ణమూర్తి పద్మావతి దంపతులు అందించారు గొల్లపూడి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం శ్రీ హరిహర సుత అయ్యప్ప క్షేత్రం గొల్లగూడెం కోదండ రామాలయం లో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
షిరిడి సాయిబాబా మందిరంలో మూడు ప్రత్యేక కౌంటర్లలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు చింతలపూడి వెంకటేశ్వరరావు ఏడు నూతల బుచ్చి రామారావు రంగా సత్యనారాయణ చెరుకూరు శ్రీనివాసరావు అబ్బూరి రమేష్ బాబా మందిరం చైర్మన్ పొడపాటి నాగేశ్వరరావు కమిటీ సభ్యులు మాదినేని దుర్గా్ర పసాద్ మిద్దె సుబ్బారావు నల్లమోతు వెంకటేశ్వరరావు తల్లపరెడ్డి గోపాలకృష్ణారెడ్డి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు గొల్లగూడెం రామాలయంలో ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ ఉండ్రు శ్యాం బాబు లగడపాటి ప్రభాకర్ రావు తోటకూర శ్రీకాంత్ గంగవరపు కిషన్ రాయి కళ్యాణంలో పాల్గొని అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ కోదండరామ స్వామి దేవాలయం లో మాజీ శాసనసభ్యు లు కొండబాల కోటేశ్వరరావు కట్టా కృష్ణార్జునురావు మిట్టపల్లి సత్యంబాబు వైరా మండల ఆర్యవైశ్య అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్ డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి కొప్పురావూరి శబరినాథ్ శ్రీరామనే ని శ్రీనివాసరావు వైరా సర్కిల్ ఇన్స్పెక్టర్ సా గర్ దంపతులు ఎస్త్స్ర వంశీకృష్ణ భాగ్యరాజు దంపతులు ఈవో ఎస్ వై డి ప్రసాద్ మేనేజర్ శ్రీనివాసరావు కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్నారు






