16 April, 2026 | 3:10 AM

వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలి

07-04-2025 12:00 AM

టేకులపల్లి, ఏప్రిల్ 6(విజయక్రాంతి):వేసవి కాలంలో పెరుగు తునటు వంటి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఓపెన్ కాస్ట్, ఇతర పని ప్రదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆరోగ్య పరంగా తీసుకో వలసిన జాగ్రతల పై ఆదివారం అవగాహనా కార్యక్రమo నిర్వహి చారు. ఈ కార్యక్రమానికి ఏరియ ఆసుపత్రి  వైద్యులు డాక్టర్. మల్లరెడ్డి ,డాక్టర్ కాశ్యప్ హాజరై ఉద్యోగులు వేసవి కాలం లో తీసుకోవలసిన ఆరోగ్య పరమైన, వైద్య పరంగా తగిన సూచనలు సలహాలు అందించారు. ముఖ్యంగా బిపి, మధుమేహం ఇతర దీర్గ కాలిక వ్యాదులచే బాధపడుతున్న వారు  వైద్యుల సలహా మేరకు ఆహార నియమాలు పాటిస్తూ వారు సూచించిన విదంగా వైద్యులను సంప్రదిస్తూ తగిన ఔషధాలు తీసుకోవాలన్నారు.

అదే విదంగా వేసవి కాలం దృష్టి లో వుంచుకొని ఉపరితల గనులలో పనిచేస్తున్న  ఉద్యోగులందరికి ప్రత్యేకంగా మజ్జిగ ప్యాకెట్లు ,ఓ.ర్ ఎస్ ప్యాకెట్లు. అందించడంతో పటు ఆర్ ఓ ప్లాంట్ ద్వారా చల్లని త్రాగు నిరు అందిసున్నారు అని తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో పి.ఓ కే.ఓ.సి. గోవింద రావు, మేనేజర్ సౌరబ్ సుమన్, పి.శ్రీనివాస్ సేఫ్టీ ఆఫీసర్  శ్రీకాంత్, సీనియర్ పర్సనల్ అధికారి అజయ్, గుర్తింపు సంఘం తరపున కే.వెంకటేశ్వర్లు, ప్రాతినిధ్య సంఘం తరపున అశోక్, ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గున్నారు