calender_icon.png 19 January, 2026 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

23-09-2024 12:58:28 AM

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పరిసరాలన్నీ సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచి ధర్మగుండం లో స్నానాలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయంలో ఆర్జితసేవలు రద్దుచేసి, గర్భా లయ ప్రవేశాలు నిలిపివేశారు. భక్తులకు శీఘ్రదర్శనం అమలు చేశారు.